27-05-2025 08:46:45 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. సికింద్రాబాద్, చిలకలగూడ, ప్యాట్నీ, బేగంపేట, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, బొల్లారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, సూరారం, షాపుర్ నగర్, గాజులరామరం, బోరబండ, సుచిత్ర, చింతల్, బాచుపల్లి, జీడిమెట్లలో వర్షం బీభత్సంగా కురుస్తుంది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది.