27-05-2025 08:52:10 PM
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
హనుమకొండ (విజయక్రాంతి): ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మసాగర్, వేలేరు, కాజీపేట మండలాలకు సంబందించిన 18 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 18 లక్షల 02వేల 088 రూపాయల విలువగల చెక్కులను అలాగే ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబదించిన 32 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 12 లక్షల 75 వేల 500 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజా పాలనలోనే నిరుపేద వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసే సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన పేదలకు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడివోలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.