27-05-2025 08:31:55 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ నగరానికి చెందిన సనాతన హిందూ సేవాసమితి(Sanatana Hindu Seva Samiti) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు. నిరుపేద కుటుంబాలను గుర్తించి చేయూత అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపల్లి వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాపగిరి గణేష్, బొల్లు సురేష్ యాదవ్, లక్కాకుల అనిల్ పాల్గొన్నారు.