calender_icon.png 24 August, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి

24-08-2025 12:57:09 AM

-వరదలకు బురదలో కూరుకుపోయిన వాహనాలు

-విరిగిపడ్డ కొండచరియలు

-ప్రాణాలు కోల్పోయిన కవిత అనే యువతి

- వరదల్లో పలువురు గల్లంతు

డెహ్రాడూన్, ఆగస్టు 23: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. చమోలీ జిల్లాలో శనివారం వేకువ జామునే కురిసిన కుంభవృష్టితో వరదనీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. థరాలీ పట్టణంలో శిథిలాల కింద చిక్కుకుని కవిత (20) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ వరదలో కొందరు గల్లంత య్యారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురి వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఆకస్మిక వరదల వల్ల ధరాలీ గ్రామం మునిగిపోయిన 20 రోజుల తర్వాత ఈ వరదలు సంభవించాయి. వరదలపై సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పు ష్కర్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘చమోలీ జిల్లాలో విపత్కర పరిస్థితులు తలె త్తాయి.

జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానిక యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని భగవంతు న్ని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. ‘వరదల వల్ల రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం’ అని చ మోలీ ఏడీఎం వివేక్ ప్రకాశ్ పేర్కొన్నారు.