calender_icon.png 24 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాకు పోస్టల్ సర్వీసులు బంద్

24-08-2025 12:50:59 AM

-సుంకాల నేపథ్యంలో నిర్ణయం

-రేపటి నుంచే అమల్లోకి

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అగ్రరాజ్యం అమెరికా సుంకాల నేపథ్యంలో భార త్ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అమెరి కాకు పోస్ట్ సర్వీసులను తాత్కాలికం గా నిలిపివేయనున్నట్టు పోస్టల్ శాఖ ప్రకటించింది. 29వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త కస్టమ్ ని బంధనలతో ఈ నిర్ణయం తీసుకున్న ట్టు అధికారులు పేర్కొన్నారు.

800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నట్టు.. జూలై 30న  జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా అమెరికాకు వెళ్లే అన్ని పో స్టల్ సర్వీసులపై సుంకాలు పడనున్నాయి.  100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటెమ్స్, లేఖలు, దస్త్రాలపై మాత్రమే సుంకాల మినహాయింపు కొనసాగుతోంది. ఇప్పటికే బుకింగ్స్ చేసిన వా రికి రీఫండ్ లభించనుంది. ఈ నిలిపివేత ఎప్పటి వరకు ఉంటుందనేది పోస్టల్ డిపార్ట్‌మెంట్ తెలపలేదు. వీ లైనంత త్వరగా సేవలను తిరిగి పునరుద్ధరించనున్నట్టు పోస్టల్ శాఖ పేర్కొంది.