calender_icon.png 29 May, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

26-05-2025 11:20:37 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. తెలంగాణలో వచ్చే  నాలుగు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) రానున్నాయి.

వర్షాల కారణంగా హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ 

రుతుపవనాలకు ముందు, హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology) అంచనా వేసింది. మే 29 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు మొదలైన వాటిని కూడా అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాలుగు రోజుల వర్షాల దృష్ట్యా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మే 29 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.