calender_icon.png 23 May, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో రెండో రోజూ భారీ వర్షం

23-05-2025 12:52:01 AM

కామారెడ్డి, మే 22 (విజయ క్రాంతి) ః కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షం రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసింది. ఈ వర్షం పడడం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. వర్షాకాలం పంటలు వేసేందుకు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉంచిన రైతులకు ఈ అకాల వర్షం మరోసారి దుక్కులు దున్ని విత్తనాలు వేయాల్సి వస్తుందని రైతులు తెలిపారు.

బుధవారం తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షమే కాకుండా గురువారం సైతం భారీ వర్షం కురిసింది. కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజక వర్గాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులను అపార నాష్టానికి గురి చేసినట్లు రైతులు వాపోతు న్నారు.

మామిడి పంట మరో 15 రోజులు,నెల లోపు పంట చేతికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల మామిడి చెట్ల నుంచి మామిడి కాయలు ఈదురు గాలులకు రాలి కింద పడిపోయాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.   పంట నష్టం వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేస్తున్నారు. ఏఈవోలు వారికి ఇచ్చిన ట్యాబ్లో పంట నష్ట వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షం ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు విజయ క్రాంతి ప్రతినిధితో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైస్ మిల్లర్లు రైతుల కష్టాన్ని నష్టాన్ని చూసి తడిసిన ధాన్యానికి కాంటా పెట్టి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

కాలం కష్టపడి పండించిన పంట కు అమ్ముకు నే సమయంలో వాతావరణం సానుకూలంగా లేక అకాల వర్షం ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను వ్యాపాలను తీవ్రనాష్టానికి గురి చేసినట్లు వాపోతున్నారు.