calender_icon.png 19 August, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాలో భారీ వర్షాలు

19-08-2025 12:00:00 AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ములుగు ఎస్పీ డాక్టర్ శబరిష్

ములుగు, ఆగస్టు18 (విజయక్రాంతి):రాష్ర్టంలోభారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరియు ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో మరియు గోదావరి పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఈ సందర్బంగా వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, గ్రామాలలో చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని మరియు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయట రావద్దని, వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని సూచించారు. విపత్కర  పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, డయల్ 100ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.