calender_icon.png 5 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్య మార్పిడితో పురోగతి

05-11-2025 01:20:27 AM

-ఐటీ, ఫార్మా, క్రీడల్లో సహకారానికి సంసిద్ధం

-స్టార్టప్స్‌కు మార్గ నిర్దేశం

-జీనోమ్ వ్యాలీని సందర్శించండి

-క్యూబా రాయబారితో భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్‌తో ఆయన మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు.

బయో టెక్నాల జీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్, కల్చర్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై చర్చించారు. అంతర్జాతీయ భాగస్వా మ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం తరఫున చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ ద్వారా క్యూబా స్టార్టప్స్‌కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదన్నారు.

ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా తదితర అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. ప్రపంచంలోని టాప్- 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘జీనోమ్ వ్యాలీ’ని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానిం చారు.   తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్  పాల్గొన్నారు.

ఏఐలో ఆవిష్కరణల వేదికగా..

కృత్రిమ మేథస్సు రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కొత్తగా తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచంలోని 20 అతి పెద్ద ఏఐ హబ్‌లలో తెలంగాణాకు స్థానం కల్పించడమే దీని ఏర్పాటు వెనక ఉన్న ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మీ సేవ కమిషనర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా ఉం టారని  పేర్కొన్నారు. “భవిష్యత్తు అంతా కృ త్రిమ మేథ రంగానిదే.  దానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.