calender_icon.png 18 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల బరిలో వారసులు

18-01-2026 01:07:51 AM

కరీంనగర్ మేయర్ స్థానంపై కన్ను

రసవత్తరంగా మారనున్న బల్దియా పోరు

కరీంనగర్, జనవరి 17 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ స్థానం బీసీ జనరల్ కావడం తో ఆయా పార్టీలకు చెందిన మం త్రులు, మాజీ మంత్రుల వారసులు ఎన్నికల బరిలోకి రావడానికి ఉత్సా హం చూపిస్తున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు వెన్నంటి ఉండి ఆయన ప్రతి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన సోదరుని కొడుకు గంగుల ప్రదీప్ ఈసారి బల్దియా బరిలో దిగి మేయర్ కావాలనే లక్ష్యం గా ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఈ మేరకు రిజర్వ్ కాబడ్డ బీసీ స్థానాల్లో తనకు అనుకూలమైన స్థానం నుంచి పోటీచేయాలనే ఉత్సాహంతో ఉన్నా రు. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సోదరుడు, కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ కుమారుడు పొన్నం అనూప్ బల్దియా బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయన్ని బరిలో దించాలని కాంగ్రెస్ లోని ఒక వర్గం మంత్రిపై ఒత్తిడితేవడానికి సిద్ధమవుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజ య్ కుమార్ పెద్ద కుమారుడు బండి భగీరథ్ బల్దియా బరిలోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. బండి సంజ య్ నిర్ణయంపైనే కుమారుని ఆరంగేట్రం ఆధారపడి ఉంటుం ది. ఆయా పార్టీల్లో మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగానే ఉన్నా వారసులు రాబోతున్నారన్న ప్రచారంతో బల్దియా పోరు రసవత్తరంగా మారే అకాశాలున్నాయి.