18-01-2026 01:09:18 AM
ఏడుపాయల్లో మాఘ స్నానం ఆచరించనున్న వేలాది మంది భక్తజనం
పాపన్నపేట, జనవరి 17: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో ప్రతి మాఘ అమావాస్య పర్వదినాన వనదుర్గమ్మ చెందన మాఘస్నానాలు చేసేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. మాగస్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం చెంతనే ఉన్న వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా జలకల సంతరించుకుంది. భక్తులు పుణ్య స్నాన మాచరించేటప్పుడు నీటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గజ ఈత గాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తు కల్పించనున్నారు.