calender_icon.png 14 January, 2026 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకునేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు

13-01-2026 12:00:00 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం టౌన్, జనవరి 12 (విజయ క్రాంతి): వీక్షకులను ఆకట్టుకునేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి సతీసమేతంగా, సోమవారం ఏదులాపురంలోని సాయి ప్రభాత్ నగర్ లో నిర్వహించిన సంక్రాంతి రంగోలి పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతుల ను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో ప్రజలు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

ముగ్గుల పోటీల్లో 840 మంది మహిళలు పాల్గొన్నారని, ప్రతి ముగ్గు ఒకటికి మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయని మంత్రి ప్రశంసించారు.రోడ్డు భద్రత, ఆడపిల్లల రక్షణ, రైతు సంక్షేమం విష యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అందరికీ తెలియజేసేలా మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయని అన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే మహిళలకు చాలా సంతోషం కలుగుతుందని అన్నారు. ముగ్గుల పోటీ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నిస్వార్ధంగా ముగ్గుల పోటీలలో విజేతలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.

అనంతరం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ అనేక ఆలోచనలతో ముగ్గుల పోటీల్లో మహిళలు ముగ్గులు వేసారని, సేవ్ ది గర్ల్ చైల్డ్, త్రాగి వాహనాలు నడప రాదు, రోడ్డు భద్రత నియమాలను పాటించాలి, దేశ ఆర్మీ మొదలగు వైవిధ్యమైన కాన్సెప్ట్ లతో ముగ్గులు వేసిన మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ బాబు, ఏదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.