calender_icon.png 21 November, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు హలో రైతన్న ఛలో బోరజ్

21-11-2025 12:40:16 AM

మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, నవంబర్ 20 (విజయక్రాం తి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట కొనుగోళ్లలో విధిస్తున్న నిబంధనల కారణంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రైతుల పక్షాన చేపట్టనున్న ఛలో బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం కు రైతులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. గురువారం జైనథ్  మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్థానిక పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ధర్నాలో కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు. ఈనెల 21న ‘హాలో రైతన్న ఛలో  బోరజ్‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంట కొనుగోళ్ళ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన నిబంధనలు తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.

వీటి కారణంగా రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని అన్నా రు. పత్తి రైతులకు అండగా చేపట్టనున్న ధర్నా కు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నా రు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటివల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆఫ్ రికార్డులో ఇరవై శాతం తేమ వచ్చిన పత్తిని సైతం పన్నెండు శాతం చేయించి కొనుగోళ్ళు చేయించిన విషయాన్నీ గుర్తు చేశారు.

ఈ విషయాన్నీ రికార్డుల్లో చూపించాలని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులు పరిష్కారమైతే తామే ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతులకు న్యాయం చేయని పక్షంలో మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగ్ రావు,  రైతులు పాల్గొన్నారు.