calender_icon.png 21 November, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ డ్రైవింగ్ నేరం

21-11-2025 12:39:35 AM

సిద్దిపేట ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్ భాస్కర్ 

సిద్దిపేట క్రైం, నవంబర్ 20 : పద్దెనిమిది ఏళ్లలోపు ఉన్నవారు వాహనాలు నడపడం చట్టరీ త్యా నేరమని సిద్దిపేట ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్ భాస్కర్ స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేటలోని గురుకృప జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు, ఉల్లంఘనలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు లైసెన్స్ పొందిన తర్వాతే వాహనం నడపాలని సూచించారు.

లైసెన్స్ లేకుండా వాహనం నడపడం శిక్షార్హమని హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలని సూ చించారు. ట్రాఫిక్ లైట్లు, జీబ్రా క్రాసింగ్ లైన్, మితిమీరిన వేగం తదితర అంశాలపై వివరించారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించబడతాయని, మైనర్ల విషయంలో తల్లిదండ్రులపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అఖిల్ , కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.