25-11-2025 08:02:15 PM
గారేపల్లి గొల్లగూడెంలో మంచినీటి బోర్ ఏర్పాటు...
కాటారం (విజయక్రాంతి): "దుద్దిళ్ల హస్తం పేదల నేస్తం" పేరిట మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలో పేదల సంక్షేమం, పల్లెల అభివృద్ధి కోసం అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని మంథని శాసనసభ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి గొల్లగూడెంలో ప్రజలకు మరింత సౌలభ్యం కోసంలో భాగంగా అదనంగా మంచినీటి బోర్ వెల్ ను ఏర్పాటు చేయించడం జరిగిందని, దానిని స్థానిక ప్రజల చేతుల మీదుగా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
"పేదల పెన్నిధి దుద్దిళ్ళ కుటుంబం" అనే విస్తృత ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా "విజయక్రాంతి"తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టే ప్రభాకర్, చీమల రాజు, కొట్టే శ్రీహరి, బషీర్ ఖాన్, అజీజ్ ఖాన్, పసుల మొగిలి, గోనె శ్రీనివాస్, గోనె మహేష్, మహీంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.