19-09-2025 12:00:00 AM
-ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయొద్దు
-టీజీపీఎస్సీ నిర్వాకం వల్లే గ్రూప్-1, ప్రిలిమ్స్, మెయిన్స్ అబాసు పాలైంది
-హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం
-29 జీవోను వెంటనే రద్దు చేయాలి
-జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): గ్రూప్ -1 ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చి న తీర్పును వెంటనే అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయవద్దని ఆయన అన్నారు. టీజీపీఎస్సీ నిర్వాకం వల్లే గ్రూప్-1, ప్రిలిమ్స్, మెయిన్స్ అబాసు పాలైందని, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చరిత్రా త్మకమన్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పి ల్‌కు వెళ్లిన ఉపశమనం దొరకదని, జరిగిన తప్పిదాలను తీర్పులో స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం విద్యానగర్లోని బీసీ భవన్ లో తెలం గాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గువ్వల భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమ వారిని కీలకమైన గ్రూప్ వన్ ఉద్యోగాల్లో నియమించుకునేందుకే ఇంట ర్వ్యూ విధానానికి స్వస్తి పలికారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో రాజకీయంగా ఉన్న స్థానంలో ఉన్న వారి పిల్లలకు లబ్ధి చేకూర్చడానికి అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
అదే విధం గా కొందరు కోట్ల రూపాయలు లబ్ధి పొందడానికి అవినీతికి పాల్పడడానికి ఇలా అవక తవకలకు పాల్పడ్డట్లు విమర్శలు ఉన్నాయని, దీనిపై సమగ్ర జ్యుడీషియల్ విచార ణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయలేదని కొత్తగా జీవో నెంబర్ 29 తెచ్చి ఈ వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలన్నారు. తెలుగులో పరీక్ష రాసిన వారి జవాబు పత్రాలను సరైన విధానంలో దిద్దలేదన్నారు.
రూల్స్ ప్రకారం ప్రొఫెఫెర్లు దిద్దాలి
రూల్స్ ప్రకారం యూనివర్సిటీ ప్రొఫెసర్లు దిద్దాలని కానీ కాంట్రాక్టు లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో బోధిస్తారని, వారు రెండింటిని మూల్యాంకనం చేస్తారని కమిషన్ చెప్పి వారి చేత వాల్యుయేషన్ చేశారని అన్నారు. అనర్హులతో పూర్తి విషయ పరిజ్ఞానం లేని వారితో పేపర్లు దిద్దించి వేల్యూషన్ చేయించారని మండిపడ్డారు.
దీనిపై ఆపిల్ ఆలో చన మానుకొని వెంటనే పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 30 వేల పో స్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడితే సహించేలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు చెరుకుల రాజేం దర్, మణికంఠ, రాజు నేత, టి. రాజ్ కుమా ర్, లింగయ్య యాదవ్, అరవింద్ స్వామి, భాస్కర్, చంద్రశేఖర్ గౌడ్, నాగరాజ్, పచ్చిపాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.