calender_icon.png 19 August, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం

18-08-2025 11:30:13 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): తన కుటుంబాన్ని ఆర్థికంగా అదుకొవావాలని  కలెక్టరేట్ ఎదుట యువకుడు  ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.  జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

బాధితుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం  సతీష్ తండ్రి బండి మధునయ్య  కిష్టంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 45 ఏండ్లు పార్ట్ టైమ్ స్వీపర్‌గా పనిచేస్తున్నారని, జనవరి 26న రిపబ్లిక్ డే జెండా అవిష్కరణ అనంతరం జెండా అవతరింపజేస్తుండగా విషపురుగు కాటు వేయడంతో ఆయన అనారోగ్యం పాలయ్యారని,  కరీంనగర్, వరంగల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ జనవరి 29న మృతి చెందాడని, అ తర్వాత కుటుంబ సభ్యులు గ్రామంలోనే పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారని, స్థానిక పోలీసులు, ప్రజా ప్రతినిధులు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తో అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్‌లో కూడా విషపురుగు కాటు వల్లే మధునయ్య మృతి చెందినట్లు తేలిందని, 

అయితే తండ్రి మరణంతో పేద చాకలి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని, కుటుంబానికి ఒకరికి ఉద్యోగం, సొంత ఇల్లు మంజూరు చేయాలని సతీష్ కలెక్టర్ ఇప్పటికే  విజ్ఞప్తి చేశాడు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందకపోవడంతో ఆవేదనకు గురైన సతీష్ సోమవారం  కలెక్టరేట్ వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం సతీష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నాడని వైద్యులు తెలిపారని, ఈ ఘటనతో జిల్లా లో కలకలం రేపింది. నిరుపేద సతీష్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం సహకారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.