calender_icon.png 8 July, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిపుత్రులకు కొండంత అండగా శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ

08-07-2025 01:21:39 AM

పల్లెల్లో అక్షర జ్ఞానాన్ని పంచుతున్న పంతులయ్య.

విద్యతోనే పేదరికం పోతుంది: డా. కృష్ణ చైతన్య స్వామి.

భద్రాచలం, జులై 7, (విజయ క్రాంతి); మన్యం లో అనేక సేవలు చేస్తున్న నృసింహ సేవా వాహిని సంస్థ గత కొన్ని సంవత్సరాలనుండి గిరిపుత్రులకు కొండంత అందగా నిలుస్తూ పేద బిడ్డలకు అక్షర జ్ఞానాన్ని అందిస్తున్నది. ప్రతి సంవత్సరం విద్యావికాసం అనే కార్యక్రమం ద్వారా కొన్ని వేల మంది చిన్నారులకు నోట్ బుక్స్ తో పాటు బ్యాగు లు ఇతర స్టేషనరి కిట్లు చేసి మన్యంలో పేద బిడ్డలకు ఓ వరం లా సేవలందిస్తున్నది శ్రీనృసింహ సేవా వాహిని.

ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ మన్యం లో అనేక గ్రామాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని పేదరికం రూపుమాపే సాధనం విద్య అని విద్యతోనే అభివృద్ధి ఉంటుందనే సంకల్పం తో దారితెన్ను లేని మారు మూల పల్లెల్లో ఈ విద్యా సంవత్సరం సుమారు 1500 మంది చిన్నారులకు ఈ బ్యాగుల కిట్లను అందజేశామని అన్నారు.

చర్ల మండలం లోని బూరుగుపాడు, చింతగుప్ప, ఆర్ కొత్తగూడెం గ్రామాలతో పాటు దుమ్ముగూడెం మండలం కొత్త దుమ్ముగూడెం లో సైతం చిన్నారులకు సోమవారం బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మేము సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నామని మేము చేస్తున్న సేవలు కనీసం ఒక్క కుటుంబం లో వెలుగులు నింపినా చాలని, ఇలా ప్రతి కుటుంబం లో మార్పులు వస్తే జన్మనిచ్చిన నేలకు సేవలు చేశామనే మా సంకల్పం నెరవేరుతుందని కేవలం విద్య ద్వారానే పురోగతి ఉంటుందని ఒక పేదవాన్ని ఉన్నతునిగా చేసే సాధనం విద్య మాత్రమే నని అన్నారు.

సమాజ సేవే లక్ష్యం గా సాగుతున్న మా సేవా ప్రపంచం లో ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలందిస్తూ తరిస్తున్నారని నిజంగా హరిజన గిరిజన పల్లెల్లో ప్రతినిత్యం శ్రీనృసింహ భక్త కుటుంబం చేస్తున్న సేవలుపలువురు కొనియాడినట్లు తెలిపారు. ఇంత చక్కని సేవలు మన్యం లో అందిస్తున్న సంస్థ సభ్యులకు మన్యం బిడ్డలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారని అన్నారు.ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి, ట్రస్టీ శ్రీధర్ శర్మ, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.