10-08-2024 01:56:00 PM
హైదరాబాద్: మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో శనివారం యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ని బయట వేసి విద్యార్థులు తగలబెట్టారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న అరుణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ సమయానికి రాకపోవడం వల్లే మరణించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.