10-08-2024 03:40:50 PM
తెలంగాణలో నూతన విమానా శ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడానికి తనిఖీలు, భద్రత పట్ల ప్రయాణీకులకు సైతం అవగాహన ఉండాలన్నారు.