calender_icon.png 18 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పోరు ముగిసింది

18-12-2025 12:00:00 AM

తుది విడత 83.32 శాతం నమోదు 

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన  ఐజి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ 

కుమ్రం భీం అసిఫాబాద్, డిసెంబర్ 17(విజయ క్రాంతి): జిల్లాలో నాలుగు మండలాలలో జరిగిన మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.తుది విడత 108 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగనుండగా రెండు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో రెండు పంచాయతీ స్థానాలలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 104 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగగా 938 వాటి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 186 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి మరో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు పడకపోవడంతో 744 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

నాలుగు మండలాలలో 121004 మంది ఓటర్లు ఉండగా 100815 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.83.32 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.ఆసిఫాబాద్ మండలంలో 29731 కీ 25199 పోలింగ్ జరుగగా 84.75 శాతం ఓటింగ్ నమోదు అయింది. రెబ్బెన మండలం 28724 కు 24599 మంది ఓటు వేశారు దీంతో 85.64 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. కాగజ్ నగర్ మండలం 44401 మందికి 35978 మంది ఫోటో హక్కు వినియోగించుకోగా 81.03 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

ఓటు హక్కును వినియోగించుకున్న నాయకులు

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మూడవ విడత పంచాయితీ ఎన్నికల్లో పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజంపేట గ్రామ పంచాయి తీగా ఏర్పాటు అయిన తర్వాత  మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేశారు, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాం నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు,కాగజ్ నగర్ మండ లం కోసిని లో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇది ఇలా ఉండగా పదుల సంఖ్యలో యువ ఓటర్లు సైతం ఓటు హక్కును వినియోగించుకోగా మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని సంతోషపడ్డారు. మూడవ విడత పం చాయితీ ఎన్నికల్లో సైతం పలువురు అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు.

ఎన్నికల కేంద్రాలను సందర్శించిన అధికారులు

తుది దశ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను మల్టీ జోన్-1 ఐ జి చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి ,డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల వేరువేరుగా సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా 795 మంది పోలీస్ సిబ్బందిని భద్రత నిమిత్తం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఎన్నికల విభాగంలోని అన్ని క్యాడర్ల అధికారులు ఎన్నికలను విజయవంతం చేయడంలో కృషి చేశారని అధికారులు తెలిపారు.