04-12-2025 12:52:18 AM
బీఈడీ, పీజీ చేసి ప్రజాసేవకు అడుగులు
నూతన విధానాలకు శ్రీకారం చుడతానంటున్న సర్పంచ్ అభ్యర్థి శిరీష తేజవర్ధన్
హన్వాడ, డిసెంబర్ 3: యువత ప్రజాసేవలోకి రావాలంటున్నప్పటికి చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటుండ్రు. చదువులోనే కాదు రాజకీయాల్లోనూ ప్రవేశించి తమ గ్రామానికి ఏదో ఒక సేవ పదిలంగా ఉండేలా చేయాలనే సంకల్పంతో మండల పరిధిలోని పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన శిరీష తేజ వర్ధన్ సర్పంచ్ బరిలో నిలిచి అందరి దృష్టిని తమ వైపు చూసేలా అడుగులు వేస్తుండ్రు.
గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో బిఈడి, పేజీలు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ అందరి మండల పొందడం విశేషంగా చర్చించుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే సంకల్పంగా అడుగులు వేయడంతో గ్రామంలోని మెజార్టీ ప్రజలు శిరీష తేజ వర్ధన్ ను ఎలాగైనా మద్దతు తెలియజేసేలా ఎవరికివారు సన్నతమవుతున్నామని గ్రామస్తులు చెబుతున్న మాట.
సేవ చేసేందుకే గ్రామంలోనే..
గ్రామానికి సేవ చేయడంలో లభించినంత సంతృప్తి మరెందులోనూ ఉండదని శిరీష తేజవర్ధన్ గ్రామంలోనే ఉంటూ అవసరమైనప్పుడల్లా ప్రజలకు సేవ చేస్తూ సుదీర్ఘ కాలం పాటు గ్రామంలోనే ఉండడం విశేషం. హైదరాబాద్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన ఉన్నప్పటికీ ఆవేవీ సంతృప్తిని ఇవ్వడం లేదని గ్రామానికి సేవ చేయడంలోనే నిజమైన సంతోషం ఉన్నదని భావించి గ్రామంలో అందరికి అందుబాటులో ఉంటు ఉద్యోగానికి దూరంగా ఉండి ప్రజలకు ఎల్లవేళలా భరోసాను కల్పిస్తూ అడుగులు వేయడం గ్రామ ప్రజలను సంతృప్తిని కలిగిస్తుందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
అవకాశం ఇచ్చి చూడండి..
ఏదో రాజకీయాల్లోకి వచ్చి మరేదో చేయాలనుకోవట్లేదు. గ్రామాన్ని అగ్రభాగంలో ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతాం. ప్రతి ఒక్కరికి అభిప్రాయాన్ని గౌరవించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం. ఎల్లప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ముందుకు సాగుదాం. గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే సర్పంచ్ బరిలో ఉంటున్నాను. గ్రామంలో మెజార్టీ ప్రజల మద్దతు తమ వైపు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను.