08-09-2025 12:38:51 AM
వర్సిటీల్లో ముఖగుర్తింపు హాజరు అమలుపై సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల వీసీలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించనుంది. అన్ని విద్యాసంస్థల్లో ముఖగుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
విద్యార్థులకే కాకుండా వర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులకు సైతం ముఖ గుర్తింపు హాజరును ఏ ర్పాటు చేయనున్నారు. ఈక్రమంలోనే త్వరలోనే అన్ని యూనివర్సిటీల వీసీలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి ముఖ గు ర్తింపు హాజరుపై ఓ నిర్ణయం తీసుకోనున్నా రు. ఇందుకోసం అవసరమైతే ప్రధాన యూ నివర్సిటీల వీసీలతో ఓ కమిటీని కూడా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.