calender_icon.png 10 September, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు మహా సభలకు రండి

08-09-2025 12:40:44 AM

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి ఆహ్వానం

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర ప్రదేశ్‌ ఆధ్వర్యంలో 3, 4, 5 జనవరి 2026న నందమూరి తారక రామారావు వేదికపై గుంటూరు, అమరావతిలో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు.

తమిళనాడులోని హోసూ రు, కోయంబత్తూర్, మదురై, చెన్ను, తంజావూర్, సేలం, తిరుత్తణి, కంచి, చిదంబరం పలు ప్రాంతాలనుండి తెలుగు మహా సభలకు తెలుగుప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ ఆర్‌ఎన్ రవికి గజల్ శ్రీనివాస్ విన్నవించారు. మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా వచ్చి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సుముఖత చూపారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.