11-12-2025 12:43:49 AM
నువ్వా నేనా అంటున్న రోకో
దుబాయి, డిసెంబర్ 9 : రిటైర్మెంట్‌కు దగ్గర పడ్డారు.. వన్డేలకూ గుడ్‌బై చెప్పేస్తే మంచిది..ప్రపంచకప్ వరకూ కొనసాగడం కష్టం.. ఇవీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(రోకో) జోడీపై గత కొంతకాలంగా వినిపిం చిన వ్యాఖ్యలు.. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఎందు కంటే మొదట ఆసీస్ టూర్‌లో, తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్‌లో వీరిద్దరూ దుమ్మురేపారు. కోహ్లీ అయితే బ్యాక్ టూ బ్యాక్ సెంచ రీలు బాదేశాడు.
అటు హిట్‌మ్యాన్ సైతం ఫిట్‌గా కనిపించడమే కాదు తన ఫామ్ కూడా కంటిన్యూ చేశాడు. వెరసి 2027 వన్డే ప్రపంచకప్‌లో తాము ఖచ్చితంగా ఆడతామనే సంకేతాలు బలంగా ఇచ్చారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాం కింగ్స్‌లో అగ్రస్థానం కోసం నువ్వా నేనా అంటున్నారు. టాప్ ప్లేస్ కోసం రోహిత్, కోహ్లీ మధ్య రసవత్తర రేసు నడుస్తోంది. తా జాగా విడుదలైన జాబితాలో రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌లో ఉండగా.. కోహ్లీ రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
ఆసీస్ టూర్‌లో చివరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్..సౌతాఫ్రికాపై మాత్రం అదరగొట్టేశాడు. వరుసగా రెండు సెంచరీలు బాదేసి, మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సిరీస్‌లో 302 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుని టాప్ ప్లేస్‌కు చేరువయ్యాడు.
ప్రస్తుతం కోహ్లీ కి, రోహిత్‌కు మధ్య తేడా 8 రేటింగ్ పాయిం ట్లే ఉన్నాయి. రోహిత్ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లీ 773 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. భారత వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ ఐదో స్థా నంలో ఉండగా.. శ్రేయాస్ అయ్యర్ పదో స్థా నానికి పడిపోయాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకులో ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఆసీస్‌తో సిరీస్‌లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిస్తే.. కోహ్లీ సౌతాఫ్రికాపై సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సాధించాడు. దీంతో ఒకరితో ఒకరు పోటీపడుతూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నువ్వా నేనా అంటున్నారు.
కాగా తమ ఫామ్, ఫిట్‌నెస్‌పై వస్తున్న అనుమానాలకు వీరిద్దరూ ఇప్పటికే తెరదించేశారు. హెడ్ కోచ్ గంభీర్‌తో పొసగడం లేదన్న వార్తలు వస్తున్నప్ప టకీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఖచ్చితంగా రోకో జోడీ ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం వీరిద్దరి ప్లేస్‌పై గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇంకా చాలా టైముంది, యువ ఆటగాళ్లు కూడా చాలా మంది రేసులో ఉన్నారంటూ మాట్లాడుతున్నాడు.