11-12-2025 12:00:00 AM
కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో జరగనున్న జాతీయ సెమినార్ వివరాలను కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ ప్రిన్సిపాల్ శాంతి వేదుల బుధవారం వెల్లడించారు. భారతీయ భాషా పరివార్ విద్యా భారతి ఉచ్ఛ శిక్షా సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 22, 23 తేదీల్లో జరగను న్న రెండు రోజుల సెమినార్‌లో భారతీయ భాష ల సేంద్రీయ ఐక్యత, మాతృభాష ఆధారిత బోధన, బహుభాషా విద్య వంటి అంశాలపై నిపుణుల చర్చలు, పుస్తకావిష్కరణలు, అభ్యాసకుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపా రు. భారతదేశం యొక్క భాషా వారసత్వాన్ని కొత్త దృక్పథంలో అర్థం చేసుకోవడమే సెమినార్ లక్ష్య ని ఆమె పేర్కొ న్నారు. ఎన్‌ఈపీ పేర్కొన్న బహుభాషా విద్యకు ఇది మరింత బలాన్నిస్తుందని శాంతి వేదుల అన్నారు.