11-05-2025 01:04:08 AM
భారత్- పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. యుద్ధం వస్తే ఎప్పుడూ ఏ ఒక్క దేశమో బాధితురాలిగా మిగలదని ఆ ప్రభావం ఎదుటి దేశం మీదా ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానించే తీరుగానే మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ఆగిపోయాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీల పరిస్థితి ఏంటనీ అంతా అయోమయంలో ఉండిపోయారు. యుద్ధపరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రారంభ వేడుకలకు హాజరుకావద్దని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించుకున్నారు.
అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించడంతో మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇక యుద్ధవాతావరణమే లేకుండా పోవడంతో ఈ పోటీలకు దూరంగా ఉండాలనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మొత్తానికి మిస్‌వరల్డ్ పోటీలు ఆగలేదని సౌందర్య పోషకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.