calender_icon.png 11 May, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింక్ బుక్..మరిపించేశారు!

11-05-2025 01:01:47 AM

రైల్వేశాఖను తాము ఎంతో అభివృద్ధి చేస్తున్నామని గర్వంగా చెప్పుకునే మోదీ సర్కారు..కనీసం రాష్ట్రాలకు ఏఏ రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నాయో కూడా చెప్పేందుకు కూడా ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కాక ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. దేశంలోని ఏ రైల్వేజోన్‌కు ఎన్ని నిధులు, ప్రాజెక్టులు ఇచ్చారో తెలిపేందుకుగాను విడుదల చేసే పింక్ బుక్ నేటికీ అందుబాటులోకి రాలేదు.

ఒకప్పుడు రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ దశ నుంచి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వేబడ్జెట్‌ను కలిపేసి తర్వాత పింక్ బుక్ ద్వారా వివరాలు తెలిపే రైల్వేశాఖ బడ్జెట్ పూర్తయి 3 నెలలు అవుతున్నా పింక్ బుక్‌ను విడుదల చేయలేదు. రైల్వేబడ్జెట్ లాగే పింక్ బుక్‌ను కూడా తొలగించేశారా అనే సందేహం కలుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వేశాఖ తీరును తప్పుపడుతున్నారు. వాళ్లకు నచ్చినట్లుగా నిధులు విడుదల చేసుకునేందుకే ఇలా చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పింక్ బుక్‌కు మోక్షం ఉందో లేదో చూడాలి మరి.

పెద్ది విజయభాస్కర్