calender_icon.png 19 August, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను ఎన్నికల నుంచి వేరుచేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

18-08-2025 11:21:27 PM

  1. మున్సిపల్ చట్టం సెక్షన్ 195ను తొలగించాలి 
  2. ప్రభుత్వానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి 

ఖైరతాబాద్; ఆగస్టు 18 (విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎన్నికల నుంచి వేరుచేసి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఫోర్ అండ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  బహిరంగ లేఖ రాశారు. సోమవారం రాసిన లేఖలో ఆయ న పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పించుట కొరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపినట్లుగా సమాచారం ఉంది అని అన్నారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగతిస్తుందని తెలిపారు. అయితే ఈ సమస్య ఇప్పట్లో తేలే విధంగా లేనందువలన బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వేరుచేసి త్వరగా గ్రామపంచాయతీ ఎలక్షన్లో జరిపించాలని కోరారు.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం దేశంలోని అధ్యక్ష, ఉపాధ్యాయులు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులను, శాసనమండలి సభ్యులను ఎన్నుకొనుటకు ఒక రాజ్యాంగబద్ధమైన కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ కమిషన్ ద్వారా ఎటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సమయానుసారం ఎన్నికలు నిర్వహించే అధికారాలను కలిగి ఉం టుందని తెలిపారు. అలాగే  243(K) ప్రకా రం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుటకు రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్ని కల కమీషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 2019 సంవత్సరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అంగీకారంతోనే స్థానిక సం స్థలు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ  మునిసిపాలిటీల చట్టం 195 ను తీసుకురావడం జరిగిందన్నారు.

తద్వారా గత 20 నెలలుగా ప్రభుత్వ అంగీకారము లేక గ్రామపంచాయితీలో ఎన్నికలు ఆగిపోవడం వలన కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే సుమారు 2300 కోట్ల రూపాయలు రాకుండా పోయాయని అన్నారు. మున్సిపల్ చట్టం 195న తొలగించడంతోపాటు బీసీ రిజర్వేషన్లను ఎన్నికల నుంచి వేరుచేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.