calender_icon.png 19 August, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: సిపిఎం

18-08-2025 10:36:46 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు గా ఉన్న ముసి ప్రాజెక్టు ను పర్యట కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం  సిపిఎం పార్టీ కేతేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మూసి ప్రాజెక్ట్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... జిల్లాలో రెండవ పెద్ద ప్రాజెక్టు అయినటువంటి మూసి ప్రాజెక్టుని పర్యాటకంగా అభివృద్ధి పరిచి ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించి,  ఈ ప్రాంతాని అభివృద్ధి పరచాలి అని ఆయన డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ పాలనలో మంత్రులు వాగ్దానాలు చేశారు తప్ప అమలుకు నోచుకోలేదని విమర్శించారు.  మంత్రుల మాటలు నీటి మీది రాతలుగానేమిగిలిపోయాయి అని అన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో సుమారు 70 ఎకరాల ప్రాజెక్టు  భూమి ఉన్నది పర్యాటక రంగానికి అభివృద్ధి పరచడాన్ని ఎంతగానోఉపయోగపడుతుందని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురవుతావుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు సుంకరి సత్తయ్య చెరుకు రమేష్ గుండ గాని భాగ్యమ్మ వంగూరి వెంకన్న చెరుకు రమేష్ శ్రీను నీలం సైదులు యాదయ్య వెంకన్న మొదలగు వారు పాల్గొన్నరు