calender_icon.png 26 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులపై వరుణుడి కన్నెర్ర

26-05-2025 12:52:02 AM

- ఆకాలవర్షంతో తడిసిన ధాన్యం

రాజాపూర్, మే 25: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం వరుణుడి ప్రతాపానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వ ర్షానికి కల్లంలో ధాన్యం తడిసి వర్షానికి కొట్టుకుపోయిన ఏమి చేయలేని దీనస్థితి రైతులకు ఎ దురైంది.

గత వారం రోజులుగా అడపాదడపా వర్షం కారణంగా కల్లంలో ఉన్న వరిదాన్యం ఎండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామంలో కల్లంలోనే ధాన్యం కుప్పలు పేరుకుపోయి రైతులు కష్టం ధాన్యం మ్యాచర్ రావడం లేదని అధికారులు వడ్లు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే వర్షం పడితే మా ధాన్యం తడిసి పోయి ధాన్యం కొనుగోలు చేసేది ఎవరని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.