12-07-2025 06:04:52 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం మద్నూర్ ఎస్సై విజయ కొండ(SI Vijay Konda)కు సన్మానం చేశారు. ఇటీవల జరిగిన కరీంనగర్ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా రెండు వెండి పతకాలు సాధించిన ఎస్ఐకి శాలువాతో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రూసేగాం భూమయ్య మాట్లాడుతూ... ఇలా ఎన్నో పథకాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ భుజం మస్నాజీ జయవాంత్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.