calender_icon.png 16 July, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల మన్ననలు పొందాలి: గజ్వేల్ ఏసిపి నర్సింలు

15-07-2025 09:51:32 PM

దౌల్తాబాద్: బదిలీపై వెళ్తున్న ఎస్సైలు ఎక్కడ విధులు నిర్వహించిన ప్రజల మన్ననలు పొందాలని గజ్వేల్ ఏసిపి నర్సింలు అన్నారు. మంగళవారం ఏఆర్ గార్డెన్ లో దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, రాయపోల్ ఎస్సై రఘుపతిలు బదిలీపై వెళ్లగా నూతనంగా వచ్చిన ఎస్ఐలు అరుణ్ కుమార్, మానసలకు తోగుట సీఐ లతీఫ్ తో కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సైలుగా విధులు నిర్వహిస్తూ మరిన్ని ప్రమోషన్లు సాధించాలని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడ ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తేనే ఎల్లప్పుడూ గుర్తు ఉంటుందని, ప్రజా చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. పోలీస్ చట్టాలను ప్రజలకు వివరించి మంచి ఫలితాలను సాధించాలని ప్రజలకు వీలైనంత వరకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. పోలీసులు ప్రజల శాంతి పద్ధతుల కోసం పనిచేస్తున్నారని ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.