calender_icon.png 16 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు వినతి పత్రం

15-07-2025 09:54:28 PM

తంగళ్ళపల్లి,(విజయకాంత్రి): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేసి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.... మండలంలో ఇసుక వే బిల్లు వారంలో రెండు రోజులు ఇవ్వాలని. పోలీస్ కేసులు ఉంటే రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా వే బిల్లులు ఇవ్వాలని. ఇందిరమ్మ ఇళ్లకు ప్రైవేటు ఇళ్లకు. ఇసుక రేటు నిర్ణయించేది ట్రాక్టర్ యజమానుల ఇష్టమని. తంగళ్ళపల్లి మండల ట్రాక్టర్లకు. తంగళ్ళపల్లి మర్రి దగ్గర నుండి ఇసుక రీచ్ కి పర్మిషన్ ఇవ్వాలని. ఇసుక వే బిల్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పర్మిషన్ ఇవ్వాలని. వే బిల్లు పూర్తి అయిపోయే వరకు చివరి ట్రాక్టర్ వెళ్లే వరకు వీఆర్వోలు  ఉండాలని. ఈ సమస్యలు కండిషన్లు పూర్తి అయ్యేవరకు. వే బిల్లు బందు చేస్తామని. మండల ట్రాక్టర్ యజమానుల సంఘ సభ్యులు అందరం ఒప్పందం కుదుర్చుకున్నామని. దీనిని ఎవరైనా అతిక్రమించితే. అక్షరాల 10,000 రూపాయల జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ విషయమై మండల లో ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకొని సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇవ్వటం జరిగిందని ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మండలంలో. అవసరాల నిమిత్తం. ఇసుక రీచ్ ప్రారంభించి మండలంలో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మండల ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి. అధ్యక్షులు ట్రాక్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.