calender_icon.png 23 August, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుడికి ఎమ్మెల్యే భరోసా

23-08-2025 12:40:27 AM

ఎల్బీనగర్, ఆగస్టు 22 : హయత్ నగర్ డివిజన్ లోని రంగనాయకులగుట్ట గ్యాస్ సిలిండర్ లీక్ బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. రంగనాయకులగుట్ట బస్తీలో నివసించే కందనమోని శివకుమార్ ఇంట్లో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి అగ్నిప్రమాదం జరిగింది.

సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగొని శ్రీధర్ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పడంతో ఆయన తక్షణమే స్పందించి రూ, 10 వేల ఆర్థిక సాయాన్ని పంపించారు. ఈ సాయాన్ని శ్రీధర్ గౌడ్ బాధితుడు శివకుమార్ దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు డ్యాగల రాకేశ్ కుమార్, పిట్టల లక్ష్మణ్ ముదిరాజ్, తొండ వెంకటేశ్, రవి నాయక్, విష్ణువర్ధన్, మధు, మనోజ్, వీరన్న తదితరులుపాల్గొన్నారు.