11-08-2025 10:15:10 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): పేదల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బిఎల్ఎన్ గార్డెన్ లో రేషన్ కార్డుల పంపిణీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీధర్ బాబు రేషన్ కార్డులు పంపిణీ అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పేదల కళ్ళలో ఆనందం చూడడానికి మా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి, ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు పాలించిన కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని పేద ప్రజలకు ఎలాంటి ఉన్నతి కల్పించలేక పోయిందని అన్నారు.
మా ప్రభుత్వ వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్ సర్వీసులు. గ్యాస్ సబ్సిడీ. కరెంటు సబ్సిడీ. రైతుబంధు తదితర సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు అన్ని విధాలు ఆదుకుంటుందని అన్ని అన్నారు. అనంతరం కాటారంలో ఏర్పాటుచేసిన పిల్లల పార్కును ప్రారంభించారు. అనంతరం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.