calender_icon.png 9 September, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సమస్యలపై ఇంటింటి సర్వే

09-09-2025 12:10:45 AM

వెంకటాపురం(నూగూరు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదిరలో  సోమవారం నా అధికారుల ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది.  ఒక్కొక్క ఆశా కార్యకర్త 20 ఇళ్లను సందర్శించాలని మాతా శిశు సంరక్షణ వైద్య అధికారి డాక్టర్ భాస్కర్ గారు ఆశా కార్యకర్తలకు తెలియపరచడం జరిగింది.

సర్వేలో భాగంగా ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య అడిగి తెలుసుకోవాలని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిందే తాగాలని, వేడి ఆహారమే భుజించాలని వైద్య శిబిరంలో వైద్యాధికారి గ్రామస్తులకు సూచించారు.

మొదటిగా శాంతినగర్ గ్రామంలో, ఎస్సీ మరి గూడెం లో వైద్య శిబిరం నిర్వర్తించడం జరిగింది. పరీక్షించుకున్న వారు గర్భవతులు ఆరు, బాలింతలు ఇద్దరు, మధుమేహం, రక్తపోటు వారికి మందులు అందజేయడం జరిగింది. శిబిరం వద్ద  49 మంది పరీక్షించుకున్నారు.