calender_icon.png 9 September, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉపాధ్యాయ ఎన్నికలో అవకతవకలు నిబంధనలు గాలికి..

09-09-2025 12:11:54 AM

ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు

గద్వాల్ సెప్టెంబర్ 8 : ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికపై జోగులాంబ గద్వాల జిల్లాలో వివాదం, అవకతవకలు జరిగాయి అంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయలు, పాఠశాల విద్యాశాఖ అధికారులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం గద్వాల్ పట్టణం అనంత ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికపై జోగులాంబ గద్వాల జిల్లాలో వివాదం రేగింది  ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయలు, పాఠశాల విద్యాశాఖ అధికారులు మధ్య వాగ్వాదం నెలకోంది. ఈ సందర్బంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతు సెలక్షన్ కమిటీ నిబంధనలను పక్కనబెట్టి, తమ అనుకూలంగా ఉన్నవారినే ఎంపిక చేశారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం కనీసం 15 సంవత్సరాల సీనియారిటీ ఉన్నవారికి అవార్డులు ఇవ్వాలని స్పష్టమైన గైడ్ లైన్ ఉన్నా జూనియర్ టీచర్లను ఎంపిక చేశారన్నారు.

ఆయా మండలాల ఎంఈఓలు తమకు అనుకూలంగా ఉన్న వారిని ముందుకు తెచ్చి జాబితాను తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో సత్ప్రవర్తన లేని వారు, గతంలో కేసులు ఎదుర్కొన్న వారిని కూడా ఎంపిక చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఒక్కో మండలానికి 5 నుండి 6 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసిన కొత్త మండలంలో కేవలం ముగ్గురినే ఎంపిక చేయడం మరో ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.

గతంలో అవార్డులు పొందిన వారికే మళ్లీ గుర్తింపు ఇవ్వడం ఒకే యూనియన్కు ఎంఈఓలు కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు చేశారు . ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక లిస్ట్ను కూడా ఆలస్యంగా విడుదల చేయడం వెనుక అంతర్యం ఏమిటని సంఘ నాయకులు ప్రశ్నించారు.కాగా కొన్ని తప్పులు గుర్తించిన తర్వాత సంఘం నాయకులు, అధికారులు కలిసి జాబితాను సవరించడంతో వివాదం కొంత వరకు సద్దుమణిగింది. 

జీవో నెంబర్ 29 ప్రకారం ఉత్తమ ఉపాధ్యాయుల ఎన్నిక.... 

జీవో నెంబర్ 29 ప్రకారం ప్రకారము ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోవడం జరిగింది. అలాగే అలిగేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయుని తొలగించాము. 

జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని