09-04-2025 12:18:58 AM
జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జే వెంకటి
ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : జీవన శైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధులను గుర్తిం చేందుకు నగరంలో నెల రోజుల పాటు ఇంటింటి సర్వేను చేపడుతున్నామని హైదరాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబ్బంది, ఆశావర్కర్ల తో సమావేశం నిర్వహించి ఇంటింటి సర్వేపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులను గుర్తించేందుకు ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నెలరోజుల పాటు దవాఖాన పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా బీపీ, మధుమేహం, ఊబకాయం, త్రోట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి వైద్య సేవలు అందించేలా కృషిచేయాలన్నారు.
ఈ క్యాక్రమం లో దవాఖాన వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోజ్ రెడ్డి, పీహెచ్‌ఎన్లు పెల్లీస్, కళావతి, ఏఎన్‌ఎంలు విజయకుమార్, సునిత, సంతోషిణి, అనురాధ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల బర్తీ, నగరంలోని ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో చాలా రోజులుగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలో బర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృతనిచ్చయంతో పినిచేస్తుందని అన్నారు.