09-04-2025 12:16:58 AM
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు గెజిటెడ్ హెచ్‌ఎంల విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కళాశాలలు, యూనివర్సిటీల్లోనూ జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయాలని గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు పరాంకుశం రాజభాను చంద్రప్రకాశ్ కోరారు. ఈమేరకు కేంద్రహోంశాఖ సహా య మంత్రి బండి సంజయన్‌ను మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రతిరోజు ఉదయం పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థన సమయంలో చేసే భారత జాతీయ ప్రతిజ్ఞలో కొన్ని మార్పులు చేర్పులు సూచిస్తూ, భారత జాతీయ గీతం “జనగణమన..,”ను ప్రైవేటు బడులు, కళాశాలల స్థాయి పాఠ్యపుస్తకాలల్లో కూడా ముద్రించాలని కోరారు. ప్రతిజ్ఞ ఆంగ్ల అనువాదంలో కూడా ఇండియాకు బదులుగా భారత్ అని మార్చాలని సూచించారు.
ప్రయివేటు, ఉన్నత తరగతుల పాఠ్యపుస్తకాలల్లోనూ జాతీయ గీతం, జాతీయ ప్రతిజ్ఞను ముద్రించాలని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి బండి సంజ య్ సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తానని వారికి స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ రాష్ర్ట ఉపాధ్యక్షులు గాజుల రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.