calender_icon.png 4 August, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం

31-07-2025 01:03:27 AM

-దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందించిన ఎమ్మెల్యే

- ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన సొంత ఇంటి కల

- ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.

- ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది

- హాజరైన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి, జూలై 30 ( విజయక్రాంతి ): ఎన్నో ఏళ్లుగా సొంతింటి నిర్మాణం కోసం క ళ్ళు గన్న కుటుంబాలు నేడు ఇందిరమ్మ ఇం టి నిర్మాణాలతో వారి సొంతింటి కలలను నెరవేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా వ నపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అం దించి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి నియోజకవర్గం ఏదుల మండలం చీర్కపల్లి గాంధీనగర్ కాలనీలో దేవరీ రేణుక w/o ఎల్ల స్వామి గారు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి బుధవా రం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారని నేడు కాం గ్రెస్ ప్రభుత్వ హాయంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రూ ఐదు లక్షల రూపాయల ఖర్చుతో సొంతింటి కల సహకారం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.గోపాల్పేట ఉమ్మడి మండలం కాం గ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీలరెడ్డి, సింగిల్ విం డో చైర్మన్ రఘు యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్, రేవెల్లి మండల కాం గ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షు లు జమ్మి మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పందెం సుఖేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, బాలస్వామి, చీ ర్కపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాములు, వెంకటస్వా మి, రవి, కాశీం, రామకృష్ణ, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు  పాల్గొన్నారు.

రేషన్ కార్డు కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

వనపర్తి, జూలై 30 ( విజయక్రాంతి ) :  అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నా రు. బుధవారం చ్‌ధవారం ఘన్ పూర్ మం డల కేంద్రంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పా టు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదన పు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతోపాటు, గృహలక్ష్మి పథకంతో అర్హులైన వారందరికీ 200 యూనిట్ల లోపు విద్యుత్ అందిస్తుందని చెప్పారు.  

ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది... కలెక్టర్ ఆదర్శ్ సురభి 

ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పం పిణీ ప్రక్రియతో పేదలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి లబ్ధి చేకూరనుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నా రు . సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి రేషన్ కార్డు అవసరం కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ ద్వారా కార్డులు తీసుకున్న వారందరూ ప్రభు త్వ పథకాలను పొందవచ్చని కలెక్టర్ గుర్తు చేశారు. అందులో భాగంగానే ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ చెప్పా రు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, జిల్లా పౌరసర ఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, ఖిశ్వనాథ్ ఘన్పూర్ మండల కాంగ్రెస్ నా యకులు విజయ్, దివ్యాంగుల సం ఘం అధ్యక్షులు ర మేష్, సింగిల్ విండో చైర్మన్ మురళీధర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, నా యకులు, తదితరులుపాల్గొన్నారు.