calender_icon.png 19 July, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కపైసాకూడా లేకుంటే అభివృద్ధి ఎట్లా చేస్తారు

19-07-2025 12:03:59 AM

-ఎంపీ డీకే.అరుణ

మహబూబ్ నగర్ రూరల్ జూలై 18 : ఒక్క పైసా కూడా తమతో లేదని ప్రభుత్వమే చెబుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలిపితే అభివృద్ధి సాధ్యమవుతుందని మ హబూబ్ నగర్ డీకే అరుణ స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ మండల పరిధిలోని జిల్లా బొక్కలోని పల్లిలో ఎంపీ డీకే.అరుణ పర్యటించారు. సీతారామాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ.7 లక్షల సీఎస్సార్ నిధులతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఓట్ల కోసం ఎంతోమంది ఎ న్నో అబద్ధపు మాటలు మాట్లాడతారని వాటిని నమ్మవలసిన అవసరం లేదన్నారు. గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం జరిగిందని, మద్దతు తెలియజేస్తే మీరు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రామాల్లో బిజెపి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రూపాయలని కాంగ్రెస్ పార్టీకి ఎం దుకు ఓటు వేయవలసిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తీసుకువచ్చి గ్రామాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు తదితరులు ఉన్నారు.