calender_icon.png 23 November, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?

10-02-2025 12:36:18 AM

  • రాజకీయంగా హిందువులు బిచ్చమెత్తుకోవాలా..?
  • బీసీలను దెబ్బతీసేలా ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కుట్ర 
  • కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా విద్యా వ్యవస్థ
  • హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లడిగే అర్హత లేదు 
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఆ పార్టీని చిత్తుగా ఓడించాలి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

నల్లగొండ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : బీసీ జాబితాలో ముస్లింలను ఎలా చేరు స్తారని.. హిందువులకు, ముస్లింలకు పోలికేం టని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎవరు అధికా రంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలుకుతారా? అని మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ముస్లింలను బీసీ జాబితాలో చేర్చితే  బీసీ స్థానాల్లో వారు పోటీ చేసి ఆధిపత్యం చెలాయిస్తారన్నారు. ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ బీసీలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర చేస్తున్నరారని మండిపడ్డారు. బీసీలతో పాటు హిందువులంతా ఏకమై కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేందుకెయ్యాలని ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలను పట్టభద్రులు, టీచర్లు గల్లాపట్టి  నిలదీయాలని సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు  ఒక్కటయ్యా యని ఆరోపించారు. అవినీతి కేసుల్లో బీఆర్‌ఎస్ నేతలను రక్షించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని, ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఎన్ని కల్లో అభ్యర్ధిని నిలబెట్టకుండా ఆ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పనిచేస్తోం దని ఆక్షేపించారు. లోపాయికారీ ఒప్పందం లేకపోతే బీఆర్‌ఎస్ అభ్యర్ధిని ఎందుకు నిలబెట్ట లేదో చెప్పాలని నిలదీశారు.

న్ని కల హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ దారు ణంగా విఫలమైందని ఆయన మండిప డ్డారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, 18 ఏండ్ల పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయో?  సీఎం రేవంత్రెడ్డి చెప్పాలన్నారు. ఫీజు రీయింబర్మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సర్కారు చోద్యం చూస్తుండడం దారుణ మన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచు తుందని ధ్వజమెత్తారు.

రెండో పీఆర్సీ నివేదిక అమలు చేయకుండా 5 డీఏలు ఇవ్వ కుండా తాత్సారం చేస్తున్నదన్నారు.  2023 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏ ఒక్కరికి ఆర్థిక ప్రయోజనాలు అందించలేదని పేర్కొన్నారు. డబ్బులివ్వలేక ఉద్యోగుల రిటైర్మెంట్ కాలాన్ని 65 ఏండ్లకు పెంచారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాట లోనే కాంగ్రెస్ నడుస్తూ నిరుద్యోగ యువత భవిష్యత్ను నాశనం చేస్తోందని దుయ్య బట్టారు.

రాష్ట్రంలో  విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని. స్కూళ్లలో చాక్ పీసులు కొనేందుకు సర్కారు దగ్గర పైసల్లేవన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు  అన్యాయం జరిగిందని, నిధులు కేటాయించలేదని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. 11 ఏండ్లుగా కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని, గ్రామాల్లో ఖర్చు చేస్తున్న నిధులపై ప్రభుత్వం చర్చకు సిద్ధమా? శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? అని సవాలు చేశారు.