calender_icon.png 6 May, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారు?

06-05-2025 12:00:00 AM

  1. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి?
  2. జనగణన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కులగణన చేస్తుంది
  3. పెద్దపల్లిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

పెద్దపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : నక్సల్స్‌పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీయే ఈరోజు నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడంఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శన మని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం కాగజ్ నగర్ నుండి కరీంనగర్ వెళుతూ మార్గమధ్యలో రామగుండంలోని ఎన్టీపీసీ స్థానిక బీజేపీ నేతలను బండి సంజయ్ ను కలిశారు.

అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో  బండి సంజయ్ మాట్లాడుతూ తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలనడం బాధాకరమన్నారు. తుపాకీ పట్టి చంపేటోళ్లతో చర్చలేందని ప్రశ్నిం చారు. దశాబ్దాలుగా నక్సల్స్ చేసిన హింసతో ఎంతో మంది చనిపోయారని, నెత్తురోడిన ఎన్నో ద్రుశ్యాలను చూసిన ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటో చెప్పాల న్నారు.

ఈ విషయంలో హరగోపాల్, వరవరరావుసహా పౌరహక్కుల సంఘం నేతలే నక్సల్స్‌కు నచ్చజెప్పాలని సూచించారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ అభివ్రుద్ది కోసం రూ.12 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసందని, ఒక్క నేషనల్ హైవేస్ అభివ్రుద్ధి కోసమే 1 లక్షా 25 వేల 485 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిపారు. 

వాళ్లతో మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్.

ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావును అడుగుతున్నా. ఎన్నో హత్యలను, చావులను చూశారు. ఎంతో మంది అమాయకులు, పోలీసులను కాల్చి చంపడాన్ని, నెత్తురోడిన ద్రుశ్యాలను చూశారు.

మరి ఇన్ని దశాబ్దలుగా మీరు సాధించిందేమిటి? శాంతి భద్రతల సమస్యను ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తామని చెప్పడం కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం కాదా, అంతెందుకు ఆనాడు టీడీపీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే నాటి సీఎం చంద్రబాబుపై నక్సల్స్ అలిపిరి వద్ద బాంబులు పేల్చి చంపాలని చూసిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్ ను చంపింది నక్సల్స్ కాదా? జాతీయ జెండా ఎగరేసినందుకు సామా జగన్మోహన్ రెడ్డిని కాల్చి చంపిన నక్సల్స్ నల్ల జెండా లు ఎగరేసి దేశద్రోహం చేయలేదా? మహాముత్తారంలో ఎస్‌ఐ భార్య శ్రీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్‌ఐని చంపేశారు. అప్పుడే కానిస్టేబుల్ ను చంపేశారు.

నక్సలైట్లు తుపాకులు వీడి జనంలోకి రావాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

రామగుండం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) ః అర్థంపర్థం లేని సిద్ధాంతాలతో అడవి బాట పట్టిన నక్సలైట్లు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలని.. తుపాకుల చేతబట్టి ఇప్పటివరకు ఏం సాధించారని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రామగుండం ఎన్టిపిసి లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తుపాకులు పట్టుకొని అడవిలో తిరిగే వారితో చర్చలు ఎలా జరుపుతామని ఆయన ప్రశ్నించారు. ఎంతోమంది రాజకీయ నాయకులను నక్సలైట్లు కాల్చి చంపలేదా? పహాల్గంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే ఇక్కడ అమాయకులను నక్సలైట్లు కాల్చి చంపుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టం కు కేంద్రం నుంచి రూ.12 లక్షల కోట్లు అందించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అనడంలో అర్థం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ప్రతిసారి కేంద్రం మాకు ఏమీ ఇవ్వడం లేదని అంటూనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో వాళ్లు ఇక్కడ డబ్బా కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత, అమరేందర్ రావు, హనుమంతు గౌడు, సోమరపు లావణ్య, క్యాతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్తదితరులు పాల్గొన్నారు.