calender_icon.png 10 July, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపద ఎలా పెరుగుతుంది?

14-08-2024 12:05:00 AM

కొన్ని వాణిజ్య గ్రూప్ కంపెనీల ఆదాయాలు, లాభాలు అంతంతమాత్రంగానే ఉన్నా, వాటి మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విలువలు కృత్రిమస్థాయిలో ఉన్నదన్న ఆందోళనతోనే కొద్ది వారాలుగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు లోనవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌లో పలు మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని వాణిజ్య సామ్రాజ్యాల  విలువ ఇలా పెరుగుతుందంటూ ఇంటర్నెల్‌లో ట్రెండవుతున్న మీమ్ ఇదిగో..

  1. ఉదాహరణకు తొలుత నా వద్ద 100 చిప్‌లు ఉన్నాయి. చట్టపరంగా నా వద్ద 75కు మించి చిప్‌లు ఉండకూడదు కనుక 27 మార్కెట్లో విక్రయించా. దీంతో ఇప్పుడు నా చెంత 73 చిప్‌లే ఉన్నాయి.
  2. సామాన్యుడిగా కనిపించే నా మామలు మార్కెట్ నుంచి 15 చిప్‌లు కొన్నారు. ఇది చట్ట విరుద్ధం. కానీ నన్నెవరు పట్టుకుంటారు?
  3. ఇప్పుడు మార్కెట్లో 12 చిప్‌లే ఉన్నాయి. వాటిలో 9 చిప్‌లను ఎల్‌ఐసీ కొన్నది. బహిరంగ మార్కెట్లో ఇక 3 చిప్‌లే మిగిలాయి.
  4. నా మామలు మార్కెట్లో చిప్‌లను మళ్లీమళ్లీ అమ్మడం, కొనడం చేస్తూ వాటికి పెద్ద డిమాండ్ ఉన్నదన్న భావనను ఇన్వెస్టర్లలో కలుగచేస్తున్నారు.
  5. రూ.2 విలువైన ప్లాస్టిక్ చిప్‌ను రూ.10 నుంచి ఆఫర్ చేస్తుండగా, జనం రూ.12, 13, 15 చొప్పున కొంటూఉంటారు. నా మామలు వాటి ధరల్ని మించి రూ.100 కు తిరిగి కొంటారు. మళ్లీ జనం రూ.105, రూ.106, రూ.108 ధరలకు కొనుగోలు చేస్తారు. కొద్ది రోజులకు మామలు వాటినే రూ.500 వద్ద కొన డం మొదలుపెడతారు. దీంతో పబ్లిక్ రూ.510, 520 వద్ద కొనేందుకు ఎగబడతారు. 
  6. నా వద్ద 73 చిప్‌లు ఉన్నాయి కదా. వాటి ప్రాధమిక ధర రెండు రూపాయిలే. అయితే ఇప్పుడు మార్కెట్ విలువ రూ.520కి పెరిగింది.ఎన్నో రెట్లు పెరిగింది. చూడండి..ఎలా  ప్రపంచ శ్రీమంతుల్లో ఒకడినై పోయానో. 
  7. ఇప్పుడు నేను బ్యాంక్‌కు వెళతా. నా వద్దనున్న 73 చిప్‌ల్లో 20 చిప్‌లను (ఒక్కోదాని మార్కెట్ విలువ రూ.520) బ్యాంక్‌లో తనఖాచేసి చిప్‌కు రూ.300 చొప్పున రుణం తీసుకుంటా. ఆ డబ్బును నా మామలకు ఇస్తా. వారు చిప్ ధరల్ని రూ.1,000కు పెంచి అమ్ముతూ, కొంటూ ఉంటారు.
  8. ఇప్పుడు మరో బ్యాంక్‌లో మరో 20 చిప్‌లను తనఖాపెట్టి చిప్‌కు రూ.600 చొప్పున రుణం తీసుకుని, డబ్బు మామలకు ఇస్తా. వారు చిప్ ధరను రూ.1,500 కు పెంచేస్తారు. ఇప్పుడు ఇంకో 20 చిప్‌లను బ్యాంక్‌లో పెట్టి చిప్‌కు రూ.1,000 చొప్పున లోన్ తీసుకుంటా.
  9. త్వరలోనే నా రూ.2 చిప్‌లన్నీ బ్యాంక్‌ల వద్ద ఉంటాయి. బ్యాంకుల డబ్బంతా నా చెంత ఉంటుంది.
  10. నిధులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో రేవులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, వేర్‌హవుస్‌లు, విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలకు బిడ్ నేను బిడ్ చేస్తా
  11. ప్రభుత్వం విక్రయానికి పెట్టే ప్రతీ ఆస్తిని నేనే కొంటా
  12. దీంతో ఇప్పుడు నావద్దనున్న బంగారం చిప్స్ (ఆస్తులు) తిరిగి ప్లాస్టిక్‌గా మారవు...ఇదీ సంగతి.