03-07-2025 12:00:00 AM
- తాహసీల్దార్ కార్యాలయంలోనే రాజీవ్, ఎన్టీఆర్ విగ్రహాలు
- పున:ప్రతిష్టకు నోచుకోని వైనం
- జయంతి, వర్ధంతులకు దక్కని గౌరవం
-నేతలను మరిచిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు
మణుగూరు, జూలై 2 ( విజయ క్రాంతి); దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలు ఏళ్ల తరబడి తాహసిల్దార్ కార్యాలయంలో మగ్గుతు న్నాయి. ఆ మహనీయుల విగ్రహాలకు ఏళ్ల తరబడి ఈ బంధనం ఏమిటంటని తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు చర్చిం చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే గత 20 05 లో ప్రధాన రహదారిని విస్తరించేందుకు సింగరేణి సంస్థ సిఎస్‌ఆర్ నిధులను కేటాయించింది.
దీంతో నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు పట్టణంలో పర్యటించి అభివృద్ధి శిలాఫలకాలను, ఆవిష్కరించి పనులకు శం కుస్థాపన చేశారు. దీంతో పైలాన్ ఆవిష్కరణ కోసం అంబేద్కర్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం, రాజీవ్ గాంధీ సెంటర్ లోని రాజీ వ్ విగ్రహాలను అధికారులు తొలగించి తాహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. అప్పటినుండి నేటి వరకు ఆ మహనీయులు విగ్రహాలు కార్యాలయంలోనే ఎండకు ఎండి వానకు తడుస్తూ శిధి లావస్థకు చేరుకున్నాయి.
గత 20 ఏళ్లకు పైగా రాజీవ్, ఎన్టీఆర్ విగ్రహాలు తిరిగి పున : ప్రతిష్టకు నోచుకోలేదు. ఎందరో పాలకులు, మరి ఎందరో అధికారులు మారుతు న్న ఈ విగ్రహాల ఊసే మర్చిపోవడం గమనార్హం. నాయకుల విగ్రహాలు వర్ధంతి, జయంతి వేడుకలకు కూడా నోచుకోకపోవ విశేషం. కేవలం రాజీవ్, ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పార్టీ నాయకులు వారి కార్యాలయాలలోనే నిర్వహించినాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించి మామ అనిపిస్తున్నారని ఆయా పార్టీల కార్యకర్తలు ఆవేదన చెం దుతున్నారు.
కేవలం ఓట్ల సమయంలోనే రాజీవ్, ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, వారి బొ మ్మలతో గద్దే నెక్కే ప్రజా ప్రతినిధులు, పార్టీ పదవులను అలంకరించే నాయకులు మ హనీయుల విగ్రహాల పునప్రతిష్టను మరిచారని ఆయా పార్టీల నాయకులు కార్యక ర్తలు విమర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి మహనీయులకు ఎన్నాళ్లీ బంధ నం.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పెద్ద లు ప్రజా ప్రతినిధులు, నాయకులు మేలుకొని తాహసిల్దార్ కార్యాలయంలోని ఎన్టీఆ ర్, రాజీవ్ విగ్రహాలను తిరిగి పట్టణంలో పు నః ప్రతిష్టించాలని అభి మానులు కోరుతున్నారు.