03-07-2025 12:00:00 AM
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్
శేరిలింగంపల్లి,జూలై 2: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి మదీనాగూడలోని ప్రనామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పీఏసీ చైర్మన్, ఎమ్యెల్యే అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితర నాయకులు పరామర్శించారు.
ప్రనామ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గౌరవ్ ను అడిగి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూ చించారు. అర్చన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యాన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ నాయక్ మానిటరింగ్ చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పు డు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిస్తున్నట్టు తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 21 మందిలో ఇప్పటి వరకు హేమసుందర్, లగ్నజిత్, శశిభూషన్ ముగ్గు రు మృతి చెందగా.. సమీర్, తారక్ ల ఆరో గ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి డిశ్చార్జ్ అవ్వగా వేగంగా కోలుకుంటున్న దణ్వీర్, రంజిత్ చౌహాన్, సత్య కుమార్ యాదవ్, గణేష్, యశ్వంత్, సంజయ్ లను సాయంత్రానికి డిచార్జ్ చేయనున్నట్లు ఆస్పత్రి వైద్యులుతెలిపారు