calender_icon.png 31 January, 2026 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ నోటీసులు ఎన్ని కల స్టంట్

31-01-2026 12:06:31 AM

  1. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కింది.
  2. విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ 

మహబూబ్ నగర్, జనవరి 30 (విజయ క్రాంతి): ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కి సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఎంపీ డీకే అరుణ క్యాంపు కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ప్రజలను మోసం చేసినందుకు ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారిందని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెర పైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్,బీఆర్‌ఎస్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ పాలిటిక్స్ తో అడుగులు వేస్తున్నాయని విమర్శించారు.

కాళేశ్వరం, ఈ కార్ రేస్ నివేదికలు వచ్చాయని, రెండేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సి ట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎం దుకు గుర్తుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవగాహన ఒప్పందం లో భాగంగా ఎన్నికలలో కాంగ్రెస్ కి లబ్ది చేకూర్చేందుకు సిట్ నోటీసులు అంటూ నాటకం ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటున్నామని చెప్పే నాటకం మాత్రమేనని,చర్యలు తీసుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కి లేదని,ఎన్నికల స్టంట్ లకు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గద్వాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ లో ఉన్నారని స్పీకర్ చెప్పారని, కాంగ్రెస్ కి ఓటు వేయండని ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవలన్నారు. స్పీకర్ కూడా కోర్టులను మోసం చేయడం, ఇంతకన్నా దారుణం ఇంకా ఏం ఉంటుందన్నారు.ఫిరాయింపుల పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు.

ఇలాంటి వాటివల్లే రాజకీయాలకు విలువలు లేకుండా మారిపోతుందని,విద్య వైద్యం,రోడ్లు,మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేవలం కేంద్రం నుంచి మాత్రమే వస్తున్నాయన్నారు.మహబూబ్ నగర్ చుట్టు పక్కల బై పాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని,మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్,బీఆర్‌ఎస్ లు చేసింది ఏం లేదన్నారు. మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తోనే సాధ్యమన్నా రు.

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నాని,మహబూబ్ నగర్ మేయర్ గా బీజేపీ కి అవకాశం ఇవ్వాలన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని,ఎన్నికలు రాగానే, శంకుస్థాపనలు చేయడం కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.