27-08-2025 02:36:18 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 26: బీజే పీ జాతీయ అ ధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే పూర్తి కావాల్సి ఉం డగా, అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆ అం శం మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి.
పార్టీ ఓ మహిళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురందేశ్వరి పేర్ల ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ఈ అంశంపై ఇప్పటికే పార్టీ అగ్రనేతలు అనేకసార్ల మంతనాలు చేశారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకా శాలు ఉన్నట్లు తెలిసింది. బహుశా, సెప్టెంబర్ 9వ తేదీ ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాతే, ఆ ప్రకటన వెలువడొచ్చని సమాచారం.