27-08-2025 02:35:14 AM
-త్రివిధ దళాల పోరాట పటిమకు ఆ ఆపరేషన్ నిదర్శనం
-2050 నాటికి భారత్ అమ్ములపొదిలో 200 యుద్ధనౌకలు
-ఏపీలోని విశాఖపట్నంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలు జాతికి అంకితం
విశాఖపట్నం, ఆగస్టు 26: ‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఆ ఆపరేషన్ త్రివిధ దళాల పోరాట పటిమ కు నిదర్శనమని కొనియాడారు. పూర్తి స్వ దే శీ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీ కొత్తగా త యారు చేసిన యుద్ధనౌకలు ఉదయగిరి (ఎ ఫ్35), హిమగిరి(ఎఫ్ 34)లను మంగళవారం ఆయన ఏపీలోని విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు.
అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. భారత నావిక దళం అత్యాధునిక సాంకేతికతను వినియోగించి యుద్ధనౌకలను తయారు చేయించిందన్నా రు. మునుపెన్నడూ లేని సెన్సార్ వ్యవస్థల ను అందుబాటులోకి తీసుకొచ్చాయని తెలిపారు. రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో తయా రు చేసిన ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసా రి అని పేర్కొన్నారు.
కొత్త యుద్ధనౌకలతో భారత నావికదళం మరింత బలోపేతం అయిందని కొనియాడారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంతో పాటు చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక రక్షణకు ఈ రెండు యుద్ధనౌకలు ఉపయోగపడతాయని తెలిపారు. 2050 నాటికి భారత్ 200 యుద్ధనౌకలు తయారు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరు ఉన్నా, భారత్ మాత్రం వసుధైక కుటుంబం అనే సూత్రాన్నే పాటిస్తున్నామని తెలిపారు.